‘హోదా’ గళాలపై ఉక్కుపాదం | Delhi Police on ap special status Concern | Sakshi
Sakshi News home page

‘హోదా’ గళాలపై ఉక్కుపాదం

Mar 8 2018 2:55 AM | Updated on Mar 23 2019 9:10 PM

సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండోరోజు బుధవారం ఢిల్లీలో కొనసాగుతున్న ధర్నా సందర్భంగా నేతలు పార్లమెంట్‌ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

సీపీఎం నేతలు మధు, వి.శ్రీనివాస్, సీపీఐ నేత రామకృష్ణ, హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బస్సుల్లోకి ఎక్కించారు. బస్సుకు అడ్డుగా నిల్చున్న కొందరు కార్యకర్తలు, మహిళలను పోలీసులు పక్కకు ఈడ్చిపారేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement