దావూద్‌ కీలక అనుచరుడు అరెస్టు | D-company gangster Dawood Lala arrested | Sakshi
Sakshi News home page

దావూద్‌ కీలక అనుచరుడు అరెస్టు

Mar 22 2017 8:32 PM | Updated on Sep 5 2017 6:48 AM

దావూద్‌ కీలక అనుచరుడు అరెస్టు

దావూద్‌ కీలక అనుచరుడు అరెస్టు

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కీలక గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ లాలా గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అరెస్టు చేసింది.

గాంధీనగర్‌: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కీలక గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ లాలా గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అరెస్టు చేసింది. అహ్మదాబాద్‌లోని జుహాపురా ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకుంది. గుజరాత్‌లో ఓ హత్య కేసుకు సంబంధించి ఎప్పటి నుంచో పోలీసులు లాలా కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని పలు కీలక నేరాల్లో అతడి చేయి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాజస్థాన్‌, గుజరాత్‌లలో దావూద్‌కు చెందిన గ్యాంగ్‌లన్నింటిని కూడా లాలానే నడిపిస్తున్నాడని ఏటీఎస్‌ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు దావూద్‌కు ఎంతో సన్నిహితంగా ఉన్న షరీఫ్‌ ఖాన్‌కు బంధువు అని కూడా తెలిసింది. మరోపక్క, లాలాను అరెస్టు చేయడంతో అతడి మరో ముగ్గురు సోదరులు కనిపించకుండా పోయారు. వారికోసం కూడా ఏటీఎస్‌ అధికారులు గాలిస్తున్నారు. ఒక్క రాజస్థాన్‌లోనే లాలాపై 15 కేసులు ఉన్నాయట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement