
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఆరోపణలు చేసిన క్రమంలో జస్టిస్ చలమేశ్వర్‌ను సీపీఐ నేత డీ .రాజా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చలమేశ్వర్ నివాసంలో వీరిద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సీనియర్ న్యాయవాది, పార్టీ నేత కపిల్ సిబల్‌తో చర్చించడంతో క్రమంగా ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందా అనే చర్చ సాగుతోంది.
కాగా జస్టిస్ చలమేశ్వర్‌తో తాను భేటీ అయ్యానని సీపీఐ నేత డీ. రాజా ధృవీకరించారు. చలమేశ్వర్ తనకు చిరకాల మిత్రుడని, ఒక్కసారిగా ఆయన ఎందుకు ఇంత ఆవేదనకు లోనయ్యారో తెలుసుకునేందుకే భేటీ అయ్యానని చెప్పారు. తమ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టం చేశారు.