భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’ | Coronavirus Positive For Kerala Students | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’

Jan 30 2020 2:14 PM | Updated on Jan 30 2020 2:31 PM

Coronavirus Positive For Kerala Students - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం : ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ విద్యార్థి కి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ విద్యార్థికి కేరళోని ఓ హాస్పిటల్‌లో ప్రత్యేక విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా,  ఆ విద్యార్థి చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నారు.

మరోవైపు చైనాలో చదువుకుంటున్న 23వేలకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించటానికి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా థర్మల్‌ స్కానింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వారి వివరాలు నమోదు చేసుకుని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడి చైనాలో 170 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. 

చదవండి : కరోనా.. పెరుగుతున్న అనుమానితుల సంఖ్య

కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement