క‌రోనా వ్యాప్తి మూడో ద‌శ‌కు చేరుకోలేదు

Coronavirus Community Transmission Not Begun In India: Harsh Vardhan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 9 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా, 23వేల మంది ప్రాణాలు విడిచారు. దీంతో భార‌త్‌లో క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్(సామాజిక‌ వ్యాప్తి) న‌డుస్తోంద‌ని చాలామంది భావిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సైతం ఈ  ద‌శ‌లోకి మ‌నం అడుగుపెట్టామ‌ని వాదిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కొట్టిపారేశారు. దేశం ఇంకా సామాజిక‌ వ్యాప్తి ద‌శ‌కు చేరుకోలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ధారావి, ముంబై వంటి వంటి ప్ర‌దేశాల్లో స్థానిక సంక్ర‌మ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రించామ‌ని తెలిపారు. ముఖ్యంగా దేశంలో కేసులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ రిక‌వ‌రీ రేటు దాదాపు 60 శాతంగా ఉండ‌టం సానుకూల అంశంగా పేర్కొన్నారు. (ఒక్కరోజులో 2.3 లక్షల కేసులు)

ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భారత్‌లో మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గానే ఉంద‌న్నారు. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ అభివృద్ధికి స‌మ‌యం ప‌డుతుంద‌ని, కానీ అందుకు నెల‌, సంవత్స‌ర‌మా అన్న విష‌యం ఎవ‌రూ చెప్ప‌లేర‌న్నారు. కాగా కోవ్యాక్సిన్‌ను ఆగ‌స్టు 15 నాటికి అంద‌రికీ అందుబాటులోకి తెస్తామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్‌) ప్ర‌క‌ట‌న జారీ చేసి నాలుక్క‌రుచుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై అనేక విమ‌ర్శలు, అభ్యంత‌రాలు వెల్లువెత్త‌డటంతో అత్యంత వేగ‌వంతంగా వ్యాక్సిన్ తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. (డబ్ల్యూహెచ్‌ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్‌)

క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ అంటే‌..? దీనికి ప్ర‌త్యేక నిర్వ‌చ‌నం అంటూ ఏదీ లేదు. అయితే దీన్ని వైర‌స్ వ్యాప్తి మూడో ద‌శగా పిలుస్తారు. క‌రోనా ఉన్న వ్య‌క్తితో కాంటాక్ట్ అవక‌పోయినా, లేదా వైర‌స్ ప్ర‌బ‌లిన ప్రాంతానికి వెళ్ల‌క‌పోయినా క‌రోనా సోక‌డాన్ని క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్‌గా పిలుచుకుంటున్నాం. అంటే ఇది స‌మాజంలో స్వేచ్ఛ‌గా వ్యాపిస్తుంది. ఇలాంటి సంక్ర‌మ‌ణ‌ను గుర్తించి, నియంత్రించ‌డం ప్ర‌భుత్వాల‌కు క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. (ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లకు బ్రేక్‌!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-08-2020
Aug 06, 2020, 04:41 IST
వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ 95 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ను జయించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన...
06-08-2020
Aug 06, 2020, 04:35 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ...
06-08-2020
Aug 06, 2020, 04:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను జయించిన వారి సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 8,729...
06-08-2020
Aug 06, 2020, 01:10 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ షెడ్యూలుపై స్పష్టత వచ్చేసింది కానీ... దానితో ముడిపడిన ఎన్నో అంశాలపై ఇంకా గందరగోళం ఉంది. ఇందులో నిర్వహణ...
05-08-2020
Aug 05, 2020, 20:46 IST
సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ‌ప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేస్తున్నారు. దీంతో బుధ‌వారం కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు...
05-08-2020
Aug 05, 2020, 20:21 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఏ ముహుర్తాన బయటపడిందో కానీ.. లక్షల మందిని బలి తీసుకుంటుంది. బుధవారం నాటికి వైరస్‌తో మరణించిన...
05-08-2020
Aug 05, 2020, 19:34 IST
భోపాల్‌ : కరోనావైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు.  జూలై...
05-08-2020
Aug 05, 2020, 18:11 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందా? అవుననే అనుమానంతోనే...
05-08-2020
Aug 05, 2020, 16:02 IST
టూరిస్టులు నిశ్శబ్దంగా ఉండటం కష్టమని భావించిన థీమ్‌ పార్క్‌ ఒకటి వినూత్నంగా ఆలోచించి ఓ పరిష్కారం కనుగొంది.
05-08-2020
Aug 05, 2020, 13:59 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో  మొత్తం కేసులు 1,76,333కి చేరాయి. ఈ క్రమంలో తాజాగా...
05-08-2020
Aug 05, 2020, 12:10 IST
సాక్షి, ముంబై : ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ కరోనా వైరస్ నివారణకు ప్రయోగాత్మక ఔషధంగా భావిస్తున్నఫావిపిరవిర్ డ్రగ్ లాంచ్ చేసింది. కోవిహాల్ట్ పేరుతో...
05-08-2020
Aug 05, 2020, 11:12 IST
కడప అర్బన్‌ : శానిటైజర్‌ తాగి ఎవరూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని  జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హితవు పలికారు....
05-08-2020
Aug 05, 2020, 11:06 IST
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో పూణేలోని...
05-08-2020
Aug 05, 2020, 10:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. మరోవైపు కరోనాను నిరోధించే టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ...
05-08-2020
Aug 05, 2020, 10:51 IST
భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(62) సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యను కుటుంబసభ్యులు...
05-08-2020
Aug 05, 2020, 10:33 IST
బూర్గంపాడు: అర్ధరాత్రి.. అటవీప్రాంతంలో జోరువాన.. అప్పుడే మరమ్మతుకు గురైన అంబులెన్స్‌.. అందులో కరోనాతో మరణించిన యువకుడి మృతదేహంతో పాటు అతడి...
05-08-2020
Aug 05, 2020, 09:50 IST
వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
05-08-2020
Aug 05, 2020, 09:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 2012 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల...
05-08-2020
Aug 05, 2020, 09:11 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎల్భీనగర్‌లో నివసించే విక్రమ్‌ ఇటీవలి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం...
05-08-2020
Aug 05, 2020, 08:57 IST
అమ్‌స్టర్‌డామ్‌ : మాస్కులు పెట్టుకోలేదంటూ భౌతిక దాడులు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి దాడుల్లో కొందరు తీవ్రంగా గాయపడగా.....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top