వాట్సాప్‌ స్పైవేర్‌తో ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌..

Congress Alleged Priyanka Gandhi Vadras Phone Hacked Through WhatsApp Spyware - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విపక్ష నేతల ఫోన్‌లను ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా, పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ ఫోన్లను ప్రభుత్వం హ్యాక్‌ చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. వాట్సాప్‌ స్పైవేర్‌ ద్వారా ప్రియాంక గాంధీ ఫోన్‌ను హ్యాక్‌ చేశారని ధ్వజమెత్తింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. కాగా ఇజ్రాయిల్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ వాట్సాప్‌ సర్వర్ల ద్వారా స్పైవేర్‌తో 20 దేశాలకు చెందిన1400 మంది యూజర్లను టార్గెట్‌ చేసిందని వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ గతవారం ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలా టార్గెట్‌ చేసిన వారిలో జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు సహా ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఎన్‌ఎస్‌ఓపై ఫేస్‌బుక్‌ దావా వేయడం ద్వారా న్యాయపోరాటానికి దిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top