
పొడవైన సొరంగ మార్గం మూసివేత
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చెనాని-నశ్రీ సొరంగ మార్గాన్ని అధికారులు మూసివేశారు.
జమ్మూ( జమ్మూ-కశ్మీర్):
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చెనాని-నశ్రీ సొరంగ మార్గాన్ని అధికారులు మూసివేశారు. దేశంలోకెల్లా ఇది అతి పొడవైన సొరంగ మార్గం(9.2 కి.మీ). సొరంగమార్గంలోని ట్యూబుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సొరంగ మార్గాన్ని అధికారులు మూసివేశారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు పాట్నిటాప్-బాటోట్ మార్గానికి మార్చారు. ఈ టన్నెల్ గత ఏప్రిల్ నెల 2న భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగరంగ వైభవంగా ప్రారంభించిన సంగతి తెల్సిందే.