ఇక నేరుగా చంద్రుడి వైపు | Sakshi
Sakshi News home page

ఇక నేరుగా చంద్రుడి వైపు

Published Thu, Aug 15 2019 4:53 AM

Chandrayaan-2 into orbit on 20th of this month - Sakshi

సూళ్లూరుపేట: సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక  నుంచి ఇస్రో గత నెల 22న నింగికెగసిన చంద్రయాన్‌–2 మిషన్‌ బుధవారం వేకువ జామున 2.21 గంటలకు భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి వైపునకు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతోంది. బుధవారం 2.21 గంటలకు 1203  సెకెండ్ల పాటు చంద్రయాన్‌–2 మిషన్లో అంతర్భాగమైన ఆర్బిటర్‌లోని  ఇంధనాన్ని (లూనార్‌ ఆర్బిట్‌ ట్రాజెక్టరీ) ద్వారా  మండించి ఆరోసారి  కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ చంద్రుడి వైపునకు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.  

బెంగళూరు సమీపంలో బైలాలులో వున్న భూనియంత్రిత కేంద్ర (మిషన్‌ ఆపరేటర్‌ కంట్రోల్‌ సెంటర్‌) నుంచి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను ఆరోసారి విజయవంతంగా నిర్వహించారు. ఆగస్టు 20 నాటికి ఆర్బిటర్‌ ల్యాండర్, రోవర్‌ను మోసుకుని చంద్రుడి కక్ష్యలోకి వెళుతుంది.  సెప్టెంబర్‌ 2వ తేదీన ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్‌ 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం వైపు మృదువైన ల్యాండింగ్‌ చేయనున్నారు. 

Advertisement
Advertisement