‘విమానాశ్రయాల్లో బాడీస్కానర్లకు ఓకే’ | body scanners in airports | Sakshi
Sakshi News home page

‘విమానాశ్రయాల్లో బాడీస్కానర్లకు ఓకే’

Jan 2 2018 4:03 AM | Updated on Apr 3 2019 5:44 PM

body scanners in airports - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని పౌర విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లను అమర్చేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) తెలిపింది. ప్రస్తుతం 27 విమానాశ్రయాల్లో అమలుచేస్తున్న ట్యాగ్‌లెస్‌ హ్యాండ్‌ బ్యాగేజ్‌ విధానాన్ని త్వరలోనే మొత్తం 59 ఎయిర్‌పోర్టులకు విస్తరిస్తామని సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హేమేంద్ర సింగ్‌ వెల్లడించారు. బాడీ స్కానర్‌ యంత్రాల వల్ల చేతులతో తనిఖీచేసే అవసరం ఉండదన్నారు. ఓ బాడీ స్కానర్‌ యంత్రాన్ని ఇటీవల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షించినట్లు తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్న 96 మంది స్వదేశీ, విదేశీ ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సింగ్‌ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement