ఆ ర్యాలీకి నిధులెక్కడివి..?

BJP To Seek Probe In Trinamool Congress Rally Funds - Sakshi

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ శనివారం విపక్షాలతో కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ర్యాలీపై పశ్చిమ బెంగాల్‌ బీజేపీ రాష్ట్ర శాఖ ఘాటుగా స్పందించింది. ఈ భారీ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణకు డిమాండ్‌ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్టు పేర్కొంది. ఈ మెగా ర్యాలీకి రూ కోట్లలో వెచ్చించారని, అడుగడుగునా కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వందలాది వాహనాలు సమకూర్చారని వీటన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు తృణమూల్‌ కాంగ్రెస్‌ బదులివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముకుల్‌ రాయ్‌ డిమాండ్‌ చేశారు.

ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ తాము ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. ప్రజలు తిరస్కరించిన నేతలతో తృణమూల్‌ చేతులు కలిపిందని విపక్షాల ర్యాలీని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాయావతి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top