'సంజయ్ దత్ను పిలవడం పెద్ద మిస్టేకే' | BJP Mumbai chief: Mistake to invite Sanjay Dutt at Maharashta Day celebrations | Sakshi
Sakshi News home page

'సంజయ్ దత్ను పిలవడం పెద్ద మిస్టేకే'

May 4 2016 11:03 AM | Updated on Mar 29 2019 9:31 PM

'సంజయ్ దత్ను పిలవడం పెద్ద మిస్టేకే' - Sakshi

'సంజయ్ దత్ను పిలవడం పెద్ద మిస్టేకే'

బీజేపీ యువజన విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు, ఇటీవల జైలు నుంచి విడుదలైన సంజయ్ దత్ను ఆహ్వానించడంపట్ల ముంబయి బీజేపీ చీఫ్ ఆశిష్ షేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంబయి: బీజేపీ యువజన విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు, ఇటీవల జైలు నుంచి విడుదలైన సంజయ్ దత్ను ఆహ్వానించడంపట్ల ముంబయి బీజేపీ చీఫ్ ఆశిష్ షేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ను ఆహ్వానించడం పెద్ద మిస్టేక్ అని అన్నారు. మే 1న ముంబయిలోని దిందోషిలో మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు మోహిత్ కాంబోజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సంజయ్ దత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఇది పలు రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఇది తెలివితక్కువ పని. ఈ కార్యక్రమ నిర్వాహకుడు చేసిన పెద్ద తప్పు. ఇలాంటి తప్పు మరోసారి రిపీట్ అవకూడదు' అని షెలార్ గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని తాను తీవ్రంగా భావిస్తున్నానని, అయితే, ఈ ఒక్కసారికి కాంబోజ్ పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement