ప్రకాష్‌ రాజ్‌ ఎక్కిన వేదికపై.. గోమూత్రం చల్లారు! | BJP members sprinkle 'divine' cow urine to cleanse stage where Prakash Raj gave a speech | Sakshi
Sakshi News home page

ప్రకాష్‌ రాజ్‌ ఎక్కిన వేదికపై.. గోమూత్రం చల్లారు!

Jan 17 2018 1:19 PM | Updated on Mar 29 2019 5:33 PM

BJP members sprinkle 'divine' cow urine to cleanse stage where Prakash Raj gave a speech - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : నటుడు ప్రకాష్‌ రాజ్‌ కర్ణాటకలోని సిర్సిలో ప్రసంగించిన వేదికను ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే బీజేపీ యువమోర్చా కార్యకర్తలు గోమూత్రం చల్లి శుభ్రపరిచారు. మన రాజ్యాంగం..మన గర్వకారణం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రకాష్‌ రాజ్‌ కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్గే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మాట్లాడటం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది.

దీంతో ప్రకాష్‌ రాజ్‌ ప్రసంగం ముగించి వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బీజేపీ యువమోర్చా కార్యకర్తలు వేదికపై గోమూత్రం చల్లి శుభ్రపరిచారు. దీనిపై ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ తాను ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ఇలాగే చేస్తారా అని  ప్రశ్నించారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్‌ పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రి క్షమాపణలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement