Sakshi News home page

బలూచిస్తాన్‌కు మద్దతుపై మోదీకి ప్రశంసలు

Published Sun, Aug 14 2016 12:14 PM

బలూచిస్తాన్‌కు మద్దతుపై మోదీకి ప్రశంసలు

న్యూఢిల్లీ: బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ అకృత్యాల్ని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయాలంటూ కశ్మీర్‌పై అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బలూచ్ హక్కుల కార్యకర్త నైలా ఖాద్రి బలోచ్ మాట్లాడుతూ ‘బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐరాస సమావేశాల్లో మోదీ లేవనెత్తాలి’ అని విజ్ఞప్తి చేశారు.

‘మీ మద్దతుకు పాకిస్తాన్‌లోని బలూచ్ ప్రజలు, పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్) ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని చెప్పారు.  ‘బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. పాక్ బలూచ్ ప్రజల్ని చంపుతోంది.ఈ విషయంలో మద్దతిచ్చేందుకు ప్రపంచానికి సరైన సమయం వచ్చిం ద’ని మరో కార్యకర్త హైదర్ బలూచ్ అన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement