breaking news
Balochistan activists
-
పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు. -
కళ్ల ముందే కడతేర్చారు
క్వెట్టా: తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా సాయుధబాటలో పయనిస్తున్న అతివాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పాకిస్తాన్లో ఏకంగా ఒక రైలునే తమ అ«దీనంలోకి తెచ్చుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయితే ఈ ఘటనలో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఇంకా ఆ దారుణ ఘటన నుంచి తేరుకోలేదు. తమ కళ్ల ముందే పాకిస్తానీ సైనికులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసిన వైనాన్ని వారు గుర్తుచేసుకున్నారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ రైలుపై మెరుపుదాడి చేసి డజన్లకొద్దీ జనాలను, రైళ్లోని పాక్ సైనికులను బలూచిస్తాన్ వేర్పాటువాదులు చంపేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపడం తెల్సిందే. చిన్నారులు, మహిళలతోపాటు వృద్ధులను వేర్పాటువాదులు ఇప్పటికే మానవతా దృక్పథంలో వదిలేయడంతో ఘటనాస్థలిలో వివరాలను ఆ వృద్దులు మీడియాతో పంచుకున్నారు. బోగీలపైకి బుల్లెట్ల వర్షం ‘‘రైలు బోలన్ కనుమ సమీపానికి రాగానే పెద్ద పేలుడు జరిగింది. పట్టాలను వేర్పాటువాదులు పేల్చేశారు. దీంతో రైలు హఠాత్తుగా ఆగింది. రైలు ఆగీఆగడంతోనే బోగీలపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సీట్ల కింద దాక్కున్నాం’’అని మహబూబ్ హుస్సేన్ అనే వృద్ధుడు చెప్పారు. తర్వాత విడుదలైన ఒక రైల్వే పోలీసు అధికారి ఈ ఘటనను వివరించారు. ‘‘ రైలు ఆగాక వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు కిందకు దిగొచ్చి రైలును చుట్టుముట్టి కాల్పులు మొదలెట్టారు. నేను, నలుగురు రైల్వే పోలీసులు, ఇద్దరు పాకిస్తానీ పారా మిలటరీ ఫ్రంటియర్ కోర్ సభ్యులందరం కలిసి వేర్పాటువాదులను ఎదుర్కొనేందుకు ప్రయతి్నంచాం. మా వద్ద మందుగుండు అయిపోయేదాకా ప్రతిఘటించాం. తర్వాత మా వద్ద బుల్లెట్లు అయిపోయాయి. చివరకు చేతులెత్తేయక తప్పలేదు ’’అని రైల్వే పోలీసు అధికారి చెప్పారు. గుంపులుగా వేరుచేసి.. ‘‘అందర్నీ కిందకు దించి ఐడీ కార్డులు అడిగారు. పోలీసులు, మహిళలు, వృద్దులు, చిన్నారులు ఇలా వేర్వేరు గుంపులుగా నిల్చోబెట్టారు. ‘ప్రభుత్వానికి డిమాండ్లు పంపించాం. అవి నెరవేరితే సరే. లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టం’’అని మాతో చెప్పారు. వాళ్లకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు వాళ్లు కొందరు సాధారణ పౌరులను, సైనికులను చంపుకుంటూ వెళ్లారు. మా కళ్లముందే ఈ ఘోరం జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇషాక్ నూర్ చెప్పారు. ‘‘అందర్నీ కిందకు దింపి ముసలివాళ్లను వదిలేశారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇలాగే పట్టాల వెంట వెళ్లిపోవాలని నన్ను, నా భార్యను హెచ్చరించారు. బతుకుజీవుడా అనుకుంటూ అలాగే నడిచి రాత్రి ఏడుగంటలకు పనీర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం’’అని భర్త నూర్ మొహమ్మద్ చెప్పారు. ‘‘పిల్లలు, మహిళలు ఉన్నారు వదిలేయండని ఎంతో వేడుకుంటే మమ్మల్ని వదిలేశారు. మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయటపడ్డాం. అందరం కలిసి ఏకధాటిగా నాలుగు గంటలపాటు నడిచి తర్వాతి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం’’అని ముహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి చెప్పారు. పారిపోబోయిన కొందర్ని చంపేశారని పోలీసు అధికారి చెప్పారు. ‘‘రాత్రి పొద్దుపోయాక వేర్పాటువాదుల్లో కొందరు అక్కడి నుంచి ని్రష్కమించారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు తప్పించుకునేందుకు విఫలయత్నంచేశారు. బందీలు తప్పించుని పరుగెత్తడం చూసిన సాయుధాలు వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాళ్లంతా పిట్టల్లా పడి బుల్లెట్లకు బలయ్యారు’’ అని చెప్పారు.కొందర్ని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లిన వేర్పాటువాదులు 440 మంది ప్రయాణికుల్లో 300 మందిని విజయవంతంగా విడిపించామని పాక్ సైన్యం చెబుతోంది. అయితే మిగతా 140 మంది పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. డజన్ల మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అయితే మిగతా వారిని వేర్పాటువాదులు బంధించి తమ వెంట తీసుకెళ్లారని రాయిటర్స్, ఏఎఫ్‌పీ వార్తాసంస్థలు కథనాలు వెలువర్చాయి. దీనిపై పాక్ సైన్యం స్పందించలేదు. మిగతా ప్రయాణికుల్లో కొందరు పారిపోయి కొండల్లో దాక్కున్నారని, ఘటనాస్థలి చుట్టుపక్కన విస్తృతస్థాయి గాలింపు తర్వాత మరణాలు, బందీలు, విడుదలైన వారి సంఖ్యలపై స్పష్టత వస్తుందని సైన్యం చెబుతోంది. క్వెట్టాలో ఖాళీ శవపేటికలు ఘటనలో చనిపోయి విగతజీవులుగా ఇంకా ఘటనాస్థలిలో అనాథలుగా పడిఉన్న వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు క్వెట్టా నుంచి రైలు బుధవారం బలూచిస్తాన్ వైపు బయల్దేరింది. డజన్ల కొద్దీ ఖాళీ శవపేటికలను రైలులోకి ఎక్కించారని అక్కడి వారు చెప్పారు. మరోవైపు ఉదయం ప్రార్థనల వేళ కొందరు ప్రయాణికులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ‘‘రంజాన్ మాసం కావడంతో బుధవారం ఉదయం పూట వేర్పాటువాదులు ప్రార్థనలకు సిద్ధమయ్యారు. ఫజర్ కోసం వేర్పాటువాదులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ రెస్క్యూ బృందాలు దాడి చేశాయి. దీంతో పోలీసులను ఎదుర్కోవడంపైనే వేర్పాటువాదులు దృష్టిసారించారు. అదే సమయంలో కొందరు పారిపోయారు. ‘‘తప్పించుకునే క్రమంలో మాలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయినాసరే ఏమాత్రం భయపడక క్షతగాత్రులను భుజాలపై మోస్తూ పరుగెత్తాం. ఎట్టకేలకు కొండకు సుదూరంగా చేరుకోవడంతో వేర్పాటువాదుల తుపాకీ గురి నుంచి తప్పించుకోగలిగాం’’అని అల్లాహ్దితా చెప్పారు. -
కెనడా ప్రధాని ద్వంద్వ నీతి.. ఆమె సంగతేంటి?
ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత్‌పై నేరారోపణ చేయడనికి కూడా వెనకాడని కెనడా ప్రధాని అనుమానాస్పద రీతిలో మరణించిన న్యాయవాది, బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాదికి అండగా? ఈ ఏడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా గుమ్మం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమ్నెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. మొదటిగా కెనడాలోని భారతీయ దౌత్యాధికారిని కూడా విధుల నుంచి తొలగించగా భారత్ కూడా అందుకు దీటుగా స్పందించి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని తొలగించి ఐదురోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ప్రధానికి లేఖ.. ఒక ఉగ్రవాది హత్య జరిగితే ఇంతగా స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడేళ్ళ క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ మరణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది కెనడాలోని బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాది హత్యపై ప్రధాని అత్యుత్సాహంతో చేసిన ఆరోపణలకు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ చేస్తుండడంపైనా కరీమా బలూచ్ మృతిపై కనీసం ఆయన స్పందించకపోవడంపై సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూ సంఘం ప్రధానికి ఒక లేఖను రాసింది. సమన్యాయం చేయండి.. బలూచ్ మానవహక్కుల సంఘం లేఖలో ఏమని రాసిందంటే.."కెనడాలో బలూచ్ వర్గం చాలా చిన్నది. పైగా పార్లమెంట్ ప్రతినిధుల ఎంపికలో కూడా మేము పెద్దగా ప్రభావం కూడా చూపలేము. బహుశా అందుకే కెనడా ప్రభుత్వం కరీమా విషయంలో ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని రాసింది. ఈ సందర్బంగా కెనడా సమాజంలోని ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటంలో బలూచ్ వర్గం ఎంతగా సహకరించింది గుర్తుచేశారు. కరీమా కేసులో కూడా కెనడా లిబరల్ ప్రభుత్వం పారదర్శకతతో విచారణ జరిపించాలని కోరారు. రెండేళ్లుగా మా గోడును పట్టించుకోని ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని.. ఇప్పటికైనా బలూచ్ సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కరీమాకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ఎవరీ కరీమా బలూచ్? కెనడాలో మూడేళ్ళ క్రితం డిసెంబర్, 20న బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత టొరంటోలోని ఒంటారియో సరస్సులో విగతజీవిగా కనిపించింది. ఈమె వృత్తి పరంగా న్యాయవాది కాగా బలూచ్ మానవహక్కుల కోసం బలంగా పోరాడారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆగడాలపై చేసిన పోరాటానికి 2016లో బీబీసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె చోటును దక్కించుకున్నారు. Karima Baloch had been exposing the reality of Pak throughout her life and #PakArmy got so scared of her that it murdered her. But it didn’t stop other Baloch from speaking the truth. She continues to inspire all of us. #FreeBalochistan@Hani_Baloch7@yalsarmachar@FawazBaloch7 pic.twitter.com/lSmaI0cIYi — Sohrab Haider (@SohrabHaider7) September 23, 2023 ఇది కూడా చదవండి: భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం' -
China Warning: పాకిస్తాన్‌కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం పాకిస్తాన్ రాజధాని కరాచీలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందగా వారిలో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా.. పాక్‌ను హెచ్చరించింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో వివిధ వ్యాపారాలు, ప్రాజెక్టుల పనుల కోసం చైనా తమ దేశ పౌరులను అక్కడికి పంపింది. కాగా, తాజాగా జరిగిన బాంబు దాడిలో ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులే చనిపోవడంతో చైనీస్ స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ పేలుడును ఖండించింది. అనంతరం పాకిస్తాన్‌లోని చైనా ప్రాజెక్టులు, సిబ్బందిని రక్షించడానికి పాక్ చొరవతీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే, ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చైనా కంపెనీలు, పాకిస్తాన్‌లోని పౌరులపై దాడులు చేస్తామని పదేపదే బెదిరిస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. చైనాకు వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చైనా.. గ్వాదర్‌ను విడిచిపెట్టి, బలూచిస్తాన్‌లోని CPEC ప్రాజెక్టులను ముగించాలని ఆర్మీ తెలిపింది. లేదంటే చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యేక విభాగం చైనీయులను టార్గెట్ చేస్తారని హెచ్చరించింది. In a video of social media the Baloch Liberation Army is seen warning China to leave Gwadar and end CPEC projects in Balochistan or they will be targeted by a special unit formed against China. China will face repercussions for its Pak Army atrocities on Baloch.#ChinaExposed pic.twitter.com/TnfgWQe4Ey — Indian Warrior (@BharatKaPraheri) April 27, 2022 ఇది కూడా చదవండి: చైనాలో కొత్త వైరస్ టెన్షన్ -
పాక్ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఏరెనాలో ఏర్పాటుచేసిన ప్రవాస పాకిస్థానీల సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో బలూచిస్థాన్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ.. గట్టిగా నినాదాలు చేశారు. బలూచిస్థాన్‌కు విముక్తి ప్రసాదించాలని, వుయ్ వాంట్ బలూచిస్థాన్ అంటూ ఈ సమావేశంలో ఓ మూలన ఉన్న ముగ్గురు కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని అడ్డుకొని దాడి చేసేందుకు అక్కడ ఉన్న కొందరు ప్రయత్నించడంతో సమావేశంలో కొంత రభస చోటుచేసుకుంది. ముత్తహిద కస్మి మూవ్మెంట్ (ఎంక్యూఎం) కార్యకర్తలు, ఇతర మైనారిటీ గ్రూపులు కూడా ఇమ్రాన్ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, పాక్ మీడియా ఈ నిరసన ప్రదర్శనల గురించి కవరేజ్ ఇవ్వకపోవడం గమనార్హం. తన పాలనలో ‘నయా పాకిస్థాన్’ను తీసుకొస్తానంటూ ఇమ్రాన్ చేసిన ప్రసంగానికి పాక్ మీడియా పెద్ద ఎత్తున ప్రచురించింది. -
బలూచిస్తాన్‌కు మద్దతుపై మోదీకి ప్రశంసలు
న్యూఢిల్లీ: బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ అకృత్యాల్ని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయాలంటూ కశ్మీర్‌పై అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బలూచ్ హక్కుల కార్యకర్త నైలా ఖాద్రి బలోచ్ మాట్లాడుతూ ‘బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐరాస సమావేశాల్లో మోదీ లేవనెత్తాలి’ అని విజ్ఞప్తి చేశారు. ‘మీ మద్దతుకు పాకిస్తాన్‌లోని బలూచ్ ప్రజలు, పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్) ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని చెప్పారు. ‘బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. పాక్ బలూచ్ ప్రజల్ని చంపుతోంది.ఈ విషయంలో మద్దతిచ్చేందుకు ప్రపంచానికి సరైన సమయం వచ్చిం ద’ని మరో కార్యకర్త హైదర్ బలూచ్ అన్నారు.