జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన గ్రనేడ్ దాడిలో 18మంది పోలీసులు గాయపడ్డారు.
పుల్వామా: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన గ్రనేడ్ దాడిలో 18మంది పోలీసులు గాయపడ్డారు. స్థానిక కళాశాల వద్ద పోలీసులు భద్రత నిర్వహిస్తుండగా ముష్కరులు గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. డిప్యూటీ ఎస్పీ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రెండురోజుల పాటు జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో భద్రత అధికారి మృతి చెందారు.