తన అనారోగ్యంపై అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ | Arun Jaitley Says Being Treated For Kidney Related Problems | Sakshi
Sakshi News home page

తన అనారోగ్యంపై అరుణ్‌ జైట్లీ ట్వీట్‌

Apr 5 2018 8:27 PM | Updated on Aug 25 2018 6:31 PM

Arun Jaitley Says Being Treated For Kidney Related Problems - Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన అనారోగ్యంపై స్పందించారు. కిడ్నీ సంబంధిత  సమస్యతో తాను బాధపడుతున్నాని గురువారం ట్విటర్‌లో  వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డాననీ, దీనికి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నియంత్రిత వాతావరణంలో తాను ప్రస్తుతం  ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నానన్నారు.  తన చికిత్సకు సంబంధించి  భవిష్యత్‌ ప్రణాళికలను తనను ట్రీట్‌ చేస్తున్న వైద్యులు నిర్ణయిస్తారని ట్వీట్‌ చేశారు. 

కాగా జైట్లీ  మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారనీ, వైద్యులు జైట్లీకి త్వరలో శస్త్రచికిత్స కూడా నిర్వహించనున్నారంటూ మంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో జైట్లీ లండన్‌ పర్యటనను కూడా వాయిదా  వేసుకున్నట్టు సమాచారం.  మరోవైపు ఈ అనారోగ్యం నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపిగా తిరిగి ఎన్నికైన తర్వాత ఆర్థిక మంత్రి సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. కొత్తగా ఎన్నుకోబడిన 58 మంది సభ్యులలో 55 మంది ఎంపీలు ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేయని ముగ్గురు సభ్యులలో జైట్లీ కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement