ఆర్టిస్ట్ హేమ హత్య కేసులో చార్జిషీట్ | Artist Hema Upadhyay murder case: Chargesheet filed by Mumbai Police | Sakshi
Sakshi News home page

ఆర్టిస్ట్ హేమ హత్య కేసులో చార్జిషీట్

Mar 11 2016 7:50 PM | Updated on Aug 20 2018 4:42 PM

ఆర్టిస్ట్ హేమ హత్య కేసులో చార్జిషీట్ - Sakshi

ఆర్టిస్ట్ హేమ హత్య కేసులో చార్జిషీట్

ప్రముఖ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ్ హత్య కేసులో ముంబై పోలీసులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు.

ముంబై: ప్రముఖ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ్ హత్య కేసులో ముంబై పోలీసులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఆమె చింతన్ ఉపాధ్యాయ్ సహా నిందితులందరి పేర్లు చార్జిషీట్ లో ఉన్నాయి. ఈ కేసులో నిందితులకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మార్చి 18 వరకు పొడిగించింది. ఈ కేసులో చింతన్ తో పాటు ప్రదీప్ రాజ్‌భర్, విజయ్ భర్, శివకుమార్ భర్ అలియాస్ సాధు నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో ఒకరు బాలనేరస్తుడు కావడంతో అతడిని బాలన్యాయస్థానంలో హాజరుపరిచారు.

హేమ ఉపాధ్యాయ, ఆమె లాయర్ హరీశ్ భంభానీ గత డిసెంబర్ 12న హత్యకు గురయ్యారు. వీరిద్దరి మృతదేహాలను ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి కందివళి ప్రాంతంలో మురికి కాలువలో పడేశారు. కిరాయి హంతకులతో చింతన్ ఈ హత్యలు చేయించినట్టు అభియయోగాలు ఎదుర్కొంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement