పాక్ దుశ్చర్య.. జవాను మృతి | Army Jawan Killed In Pak Firing In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

పాక్ దుశ్చర్య.. జవాను మృతి

Nov 8 2016 5:26 PM | Updated on Sep 4 2017 7:33 PM

పాకిస్థాన్ మరోసారి దురాఘతానికి పాల్పడింది. కశ్మీర్లోని నౌషెరా ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీంతో ఒక భారత ఆర్మీ జవాను వీరమరణం పొందాడు.

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి దురాఘతానికి పాల్పడింది. కశ్మీర్లోని నౌషెరా ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీంతో ఒక భారత ఆర్మీ జవాను వీరమరణం పొందాడు. మరో ఇద్దరు సైనికులు గాయాలపాలయ్యారు. భారత బలగాలు పాకిస్థాన్ సైనికుల మధ్య ఈ కాల్పులు ఉదయం 8.45గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

రోజంతా పాక్ రేంజర్స్ మోర్టార్ షెల్స్తో దాడులు చేస్తునే ఉన్నారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోపక్క, పూంచ్ సెక్టార్లోని సాగా, బాల్నోయి, సాలోత్రి ప్రాంతంలో భారీ స్థాయిలో కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement