సగానికి తగ్గనున్న ఐఫోన్ రేట్లు! | Apple iPhone 5S to get cheaper after iPhone SE launch | Sakshi
Sakshi News home page

సగానికి తగ్గనున్న ఐఫోన్ రేట్లు!

Mar 10 2016 10:08 AM | Updated on Sep 3 2017 7:26 PM

సగానికి తగ్గనున్న ఐఫోన్ రేట్లు!

సగానికి తగ్గనున్న ఐఫోన్ రేట్లు!

మార్కెట్లో ఎన్ని మొబైల్లు ఉన్నా యాపిల్ ఐఫోన్కు ఉన్న క్రేజే వేరు.

న్యూఢిల్లీ: మార్కెట్లో ఎన్ని మొబైల్లు ఉన్నా యాపిల్ ఐఫోన్కు ఉన్న క్రేజే వేరు. అయితే ఆ ఫోన్కు ఉన్నటువంటి ఖరీదు దృష్ట్యా కొనడానికి ఆలోచిస్తున్నవారికి ఓ శుభవర్త చెబుతున్నారు మొబైల్ మార్కెట్ విశ్లేషకులు. యాపిల్ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి రాగానే ఐఫోన్ 5ఎస్ రేట్లు సగానికి తగ్గనున్నాయట.

యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ మోడల్ను మార్చ్ 22న లాంచ్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి వచ్చిన అనంతరం ఇప్పుడు అమెరికాలో 450 డాలర్లుగా ఉన్న ఐఫోన్ 5ఎస్ ధర 225 డాలర్లకు తగ్గనుందని కేజీఐ సెక్యురిటీస్కు చెందిన ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ మింగ్ చీ క్యో తెలిపారు.  భారత్లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 5ఎస్ ధరను తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్ ఎస్ఈ మోడల్ రాకతో ఇండియాలో ఐఫోన్ 5ఎస్ ధర మరింత తగ్గనుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే రానున్న కొద్ది మాసాల్లో ఐఫోన్ 5ఎస్ ఇండియాలో రూ. 12 వేల నుండి 13000 వేలకు లబిస్తుందని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ధరకు అందించడం ద్వారా ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను యాపిల్ తనవైపు తిప్పుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement