breaking news
iphone SE launch
-
ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
ఇండియన్ మార్కెట్లో యాపిల్ (Apple) ఐఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పడు 'ఎస్ఈ 4' ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథంనలో తెలుసుకుందాం.గత రెండేళ్లుగా.. ఇప్పుడు, అప్పుడు అనుకుంటున్న 'ఐఫోన్ ఎస్ఈ 4' (iPhone SE 4) ఈ వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించడం లేదు. కాబట్టి వారం మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్.. యాపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ పొందనుంది. అయితే దీని డిజైన్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ 16లను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగి 60Hz ప్యానెల్ పొందే అవకాశం ఉంది. 48 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి ఇందులో ఉండవచ్చు. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Power On: Apple’s new iPhone SE coming this week will kick off one of the most pivotal periods in the iPhone’s nearly two decade history https://t.co/npwXOGgv63— Mark Gurman (@markgurman) February 9, 2025 -
సగానికి తగ్గనున్న ఐఫోన్ రేట్లు!
న్యూఢిల్లీ: మార్కెట్లో ఎన్ని మొబైల్‌లు ఉన్నా యాపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు. అయితే ఆ ఫోన్‌కు ఉన్నటువంటి ఖరీదు దృష్ట్యా కొనడానికి ఆలోచిస్తున్నవారికి ఓ శుభవర్త చెబుతున్నారు మొబైల్ మార్కెట్ విశ్లేషకులు. యాపిల్ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి రాగానే ఐఫోన్ 5ఎస్ రేట్లు సగానికి తగ్గనున్నాయట. యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ను మార్చ్ 22న లాంచ్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి వచ్చిన అనంతరం ఇప్పుడు అమెరికాలో 450 డాలర్లుగా ఉన్న ఐఫోన్ 5ఎస్ ధర 225 డాలర్లకు తగ్గనుందని కేజీఐ సెక్యురిటీస్కు చెందిన ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ మింగ్ చీ క్యో తెలిపారు. భారత్‌లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 5ఎస్ ధరను తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్ ఎస్ఈ మోడల్ రాకతో ఇండియాలో ఐఫోన్ 5ఎస్ ధర మరింత తగ్గనుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే రానున్న కొద్ది మాసాల్లో ఐఫోన్ 5ఎస్ ఇండియాలో రూ. 12 వేల నుండి 13000 వేలకు లబిస్తుందని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ధరకు అందించడం ద్వారా ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను యాపిల్ తనవైపు తిప్పుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.