మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | AOB encounter: Tension prevails at malkangiri sp office | Sakshi
Sakshi News home page

మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Oct 26 2016 12:00 PM | Updated on Mar 28 2019 5:07 PM

ఒడిశా మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మల్కన్ గిరి: ఒడిశా మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్కౌంటర్లో మరణించినవారి మృతదేహాలను చూపించాలని డిమాండ్ చేస్తూ  హక్కుల సంఘం నేతలు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అయితే మృతుల ఫోటోలు మాత్రమే చూపిస్తామని ఎస్పీ మహాపాత్రో స్పష్టం చేశారు.

బంధువులకు మాత్రమే మృతదేహాలను అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినవారిలో కళ్యాణరావు, వరవరరావు, పద్మ తదితరులు ఉన్నారు. మరోవైపు ఎన్కౌంటర్ పై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement