breaking news
encounter bodys
-
దిశ: మృతదేహాల అప్పగింతపై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించే వ్యవహారంపై శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 6న ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలను కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భద్రపర్చారని, మృతదేహాల కడచూపు కోసం వారి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారని గురువారం హైకోర్టులో న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై పిటిషనర్, ప్రభుత్వ వాదనల నిమిత్తం శుక్రవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఘటనపై హైకోర్టు ప్రస్తుత లేదా రిటైర్డు న్యాయమూర్తితో జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశాలించాలని కోరుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సంఘం సభ్యుడు రాఘవేంద్రప్రసాద్ పిల్ దాఖలు చేశారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగింత అంశా లపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని రాఘవేంద్రప్రసాద్ తరఫున న్యాయవాది మల్లికంటి వెంకన్న ధర్మాసనానికి అందజేశారు. -
మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మల్కన్ గిరి: ఒడిశా మల్కన్ గిరి ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్కౌంటర్లో మరణించినవారి మృతదేహాలను చూపించాలని డిమాండ్ చేస్తూ హక్కుల సంఘం నేతలు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అయితే మృతుల ఫోటోలు మాత్రమే చూపిస్తామని ఎస్పీ మహాపాత్రో స్పష్టం చేశారు. బంధువులకు మాత్రమే మృతదేహాలను అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినవారిలో కళ్యాణరావు, వరవరరావు, పద్మ తదితరులు ఉన్నారు. మరోవైపు ఎన్కౌంటర్ పై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.