పాకిస్తాన్ నిఘా సంస్థలకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో మాజీ సైనికుడు సుఖ్వీందర్ సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
అమృత్‌సర్: పాకిస్తాన్ నిఘా సంస్థలకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో మాజీ సైనికుడు సుఖ్వీందర్ సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆర్మీ వాహనాల కదలికలు, కీలక సంస్థలు, ఆర్మీ శిక్షణ శిబిరాల పత్రాల ఫొటోలు, చేతితో గీసిన నిషిద్ధ స్థలాల పటాలను సింగ్ దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంగ్రూర్ జిల్లాకు చెందిన సింగ్ ‘21 సిక్కు లైట్ పదాతిదళం’లో పనిచేసి 2005లో ఉద్యోగ విరమణ చేశాడు. ప్రస్తుతం ప్రైవేటు గిడ్డంగిలో సెక్యూరిటీ గార్డ్‌గా పని ఉన్నాడు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి సింగ్‌ను డబ్బు, ఉద్యోగం ఇస్తామని ప్రలోభపెట్టాడని, అతడు ‘శర్మ జీ’ పేరుతో పాక్‌కు గూఢచారిగా పనిచేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. భారత సరిహద్దుల్లో ఏర్పాటు చేసే బంకర్ల వివరాలు, నభా, సంగ్రూర్‌లలో ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేసే పనిని సింగ్‌కు అప్పగించారు.