యూపీ ఆర్డినెన్స్‌ నేపథ్యంలో ఎంఐఎం వ్యాఖ్యలు

AIMIM Leader Waqar Appealed To Centre To Declare Cow As The National Animal - Sakshi

‘బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు చొరవ చూపాలి’

గువహటి : గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్‌ అసీం వకార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆవులపై సరైన వ్యూహం అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు.

విక్రేతల నుంచి మంచి ధరలకు గోవులను కొనుగోలు చేసి వాటిని షెల్టర్‌ హోంలలో ఉంచేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వకార్‌ సూచించారు. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్‌ పదార్ధాలను తింటూ, డ్రైన్‌ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గో రక్షణ, గోవధ నియంత్రణ కోసం యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం గోవథకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ 5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు.

చదవండి : గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో? 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top