53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా | 53 Journalists Tests Coronavirus Positive In Mumbai | Sakshi
Sakshi News home page

జ‌ర్న‌లిస్టుల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా: ఒక్క‌రోజే 53 మందికి..

Apr 20 2020 4:43 PM | Updated on Apr 20 2020 4:47 PM

53 Journalists Tests Coronavirus Positive In Mumbai - Sakshi

ముంబై: దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్ర ముందంజ‌లో ఉంది. రాష్ట్రంలో న‌మోద‌వుతున్న కేసుల్లో ఒక్క‌ ముంబై న‌గ‌రంలోనే సుమారు స‌గం కేసులు న‌మోదవుతుండ‌టం అధికారుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకింది. బీఎంసీ(బృహన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అయితే వారెవ‌రికీ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పో‌వ‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్ట‌ర్లు, కెమెరామ‌న్‌లు క‌లుపుకుని మొత్తంగా 167 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వీరిలో సుమారు 53 మందికి సోకిన‌ట్లు తేలింది. (కరోనా: ఇంటి రెంట్‌ మూడు నెలలు వాయిదా)

దీంతో వెంట‌నే వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారి స‌హోద్యోగుల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా సోకిన‌వారు క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన వారు కాగా టీవీ జ‌ర్న‌లిస్టుల‌కే ఎక్కువ‌గా సోకింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇదిలావుండ‌గా మ‌హారాష్ట్రలో ‌4,203 మందికి క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా 223 మంది మర‌ణించారు. 507 మంది క‌రోనాను జ‌యించి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (500 దాటిన కరోనా మరణాలు)

Advertisement
 
Advertisement
Advertisement