కారుకింద పడినా.. ఆ మూడేళ్ల పాప సేఫ్ | 3-year-old miraculously survived car accident in Nashik | Sakshi
Sakshi News home page

కారుకింద పడినా.. ఆ మూడేళ్ల పాప సేఫ్

Jul 9 2015 7:51 PM | Updated on Aug 14 2018 3:22 PM

కారుకింద పడినా.. ఆ మూడేళ్ల పాప సేఫ్ - Sakshi

కారుకింద పడినా.. ఆ మూడేళ్ల పాప సేఫ్

ఇన్నోవా కారు మీద నుంచి పోయిన ఓ మూడేళ్లపాప ప్రాణాలతో బయటపడింది. నాసిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

నాసిక్: తలరాత బాగుంటే ఎలాంటి ప్రమాదం జరిగిన బతుకుతారు.. అదే తలరాత బాగలేకుంటే ఏ ప్రమాదం లేకుండానే చనిపోతారు. ఇది సాధారణంగా అందరు అనుకుంటూ ఉండే మాట. అయితే, బహుషా ఇలాంటి మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇన్నోవా కారు మీద నుంచి పోయిన ఓ మూడేళ్లపాప ప్రాణాలతో బయటపడింది. నాసిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ రోడ్డుపక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

దాని ప్రకారం ఓ ఇన్నోవా కారు వెళుతుండగా వడివడి అడుగులు వేసుకుంటూ ఓ మూడేళ్లపాప రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అది చూసుకోని కారుడ్రైవర్ పాప మీద నుంచే పోనిచ్చాడు. కారు పూర్తిగా పాప మీద నుంచి వెళ్లగా కారుకు ఎదురుగా ఉన్ పాప తల్లి అది చూసి గట్టిగా కేకవేసి కారును అపేసింది. వెంటనే కారు వెనుక టైరువద్ద ఉన్న చేతుల్లోకి తీసుకుంది. పైకి ఎలాంటి గాయాలవకున్నా కొంత స్పృహతప్పినట్లు కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాప శరీర అంతర్భాగంలో కొంచెం బ్లీడింగ్ అవుతుందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement