
ముజఫర్‌నగర్ : విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక థానాభవన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కర్‌వీర్‌సింగ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా, నితిన్ కుమార్, సోనూలు కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. కాగా శనివారం డ్యూటీలో ఉండగానే స్థానికంగా నిర్వహించిన ఓ ప్రైవేట్ వేడుకకు హాజరై బోజనం చేసి డ్యాన్స్‌లు చేయడం వివాదాస్పదమయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎస్పీ అజయ్‌కుమార్ ఆ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.