డాన్సర్లను కిడ్నాప్ చేసి.. తుపాకి చూపి గ్యాంగ్ రేప్ | 2 Women Allegedly Kidnapped, Gang-Raped At Gunpoint In Agra | Sakshi
Sakshi News home page

డాన్సర్లను కిడ్నాప్ చేసి.. తుపాకి చూపి గ్యాంగ్ రేప్

Jul 1 2016 11:37 AM | Updated on Aug 21 2018 3:16 PM

డాన్సర్లను కిడ్నాప్ చేసి.. తుపాకి చూపి గ్యాంగ్ రేప్ - Sakshi

డాన్సర్లను కిడ్నాప్ చేసి.. తుపాకి చూపి గ్యాంగ్ రేప్

ఓ డాన్స్ ట్రూప్ సభ్యులైన ఇద్దరు మహిళలను దాదాపు 12 మంది దుండగులు కిడ్నాప్ చేసి, వాళ్లకు తుపాకులు చూపి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు.

ఓ డాన్స్ ట్రూప్ సభ్యులైన ఇద్దరు మహిళలను దాదాపు 12 మంది దుండగులు కిడ్నాప్ చేసి, వాళ్లకు తుపాకులు చూపి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన దేశంలోనే పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ఆగ్రా నగరంలో జరిగింది. నిందితులలో రాజ్, జితేందర్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి వీళ్లే ఈ డాన్స్ ప్రదర్శన ఏర్పాటుచేసి, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఆగ్రా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రైవేటు కార్యక్రమం ఏర్పాటుచేసుకున్నారు. అక్కడకు కొంతమంది డాన్సర్లను పిలిపించారు. మథుర నుంచి మొత్తం ఆర్కెస్ట్రా దిగింది. బృందంలో బాధితులిద్దరితో పాటు మరో మహిళ కూడా ఉంది. అయితే ఆమె గర్భవతి కావడంతో వదిలేశారు.

షో మధ్యలో గొడవ అయ్యిందని, దాంతో తామందరినీ వెళ్లిపొమ్మన్నారని ఆ మూడో మహిళ తెలిపింది. నిర్వాహకులు తమను మథురకు దింపుతామన్నారని, దారి మధ్యలో కొంతమంది సాయుధులు మోటారు సైకిళ్లపై తమను ఫాలో అయ్యారని, గ్రామానికి ఒక కిలోమీటరు తర్వాత వాళ్లు కారు ఆపి, 10-12 మంది సాయుధులు తమపై దాడి చేశారని చెప్పింది. ఓ ఇంట్లోకి తీసుకెళ్లి రెండు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని, అరవద్దంటూ తుపాకులతో బెదిరించారని తెలిపింది. తర్వాత బాధిత మహిళలు ఇద్దరూ ఆగ్రా పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement