ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పొచ్చింది | 1993 Mumbai blasts case: Abu Salem and six others convicted by Tada court | Sakshi
Sakshi News home page

ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పొచ్చింది

Jun 16 2017 1:10 PM | Updated on Sep 5 2017 1:47 PM

ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పొచ్చింది

ముంబై భారీ పేలుళ్ల కేసులో తీర్పొచ్చింది

ముంబై పేలుళ్ల కేసులో టీడా కోర్టు తీర్పును వెలువరించింది. అబూసలేంతో సహా మొత్తం ఏడుగురుని దోషులుగా టాడా కోర్టు దోషులుగా ప్రకటించింది.

ముంబయి: ముంబై పేలుళ్ల కేసులో టీడా కోర్టు తీర్పును వెలువరించింది. అబూసలేంతో సహా మొత్తం ఏడుగురుని దోషులుగా టాడా కోర్టు దోషులుగా ప్రకటించింది. హత్య, కుట్ర కేసు కింద విధించనున్న శిక్షపై స్పష్టత రావాల్సి ఉంది. 1993 మార్చి 12న ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 257మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్లకు సూత్రదారి అయిన దావూద్‌ ఇబ్రహీం పాక్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఇబ్రహీంకు కీలక అనుచరుడైన గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంతోపాటు ఆరుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై అభియోగాలు నమోదుచేయగా తాజాగా శుక్రవారం టాడా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం తొలుత ముస్తాఫా దోసాను దోషిగా ప్రకటించింది. ఇతడిపై ఆయుధాలు దిగుమతి చేసేందుకు సహకరించడంతోపాటు పేలుళ్ల కుట్ర అమలుచేసేందుకు ముంబయి, దుబాయ్‌ నగరాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాల్గొన్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమాన్‌ కూడా ఉన్నాడు. అలేగే, మరో నిందితుడు ఫిరోజ్‌ ఖాన్‌, తాహిర్‌ మర్చంట్‌ను కూడా కోర్టు దోషిగా ప్రకటించింది.

వీరిపై కుట్రను అమలుచేయడం కోసం భారత్‌లో మహ్మద్‌ దోసా నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంతోపాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను దొంగ మార్గంలో తరలించేందుకు సహాయం చేసిన ఆరోపణలు ఉన్నాయి. తాహిర్‌పై మాత్రం ఆయుధాలను బాంబులు పేల్చే నైపుణ్యం నేర్చుకునే మనుషులను ముంబయి నుంచి పాక్‌ పంపించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, కరీముల్లాఖాన్‌ను, ఖయ్యూం షేక్‌ను, రియాజ్‌ సిద్ధిఖీని కూడా కోర్టుదోషులుగా ప్రకటించింది. చివరిగా కీలక నిందితుడిగా భావిస్తున్న అబూసలేంను కోర్టు దోషిగా పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement