పెళ్లి బస్సు బోల్తా, 15 మంది మృతి | 15 died in marriage team bus slipped incident in madhya pradesh | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సు బోల్తా, 15 మంది మృతి

Dec 15 2015 10:12 AM | Updated on Sep 3 2017 2:03 PM

మధ్యప్రదేశ్ లోని హోషాంగాబాద్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

భోపాల్: మధ్యప్రదేశ్ లోని హోషాంగాబాద్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు హోషాంగాబాద్ సమీపంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతిచెందగా, మరికొంత మందికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement