‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

Young Hero Nithin Guest Role In Varun Tej Valmiki - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. తమిళ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు అధర్వ మురళీ మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు సినీ ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్‌ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నితిన్‌ కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్‌ స్పందించాల్సి ఉంది.

వరుణ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top