సీరియల్ కోసం గుండు చేయించుకున్న నటి | Yeh Vaada Raha: Rinku Karmarkar aka Tai excited about new bald look | Sakshi
Sakshi News home page

సీరియల్ కోసం గుండు చేయించుకున్న నటి

Jan 5 2016 7:23 PM | Updated on Sep 3 2017 3:08 PM

సీరియల్ కోసం గుండు చేయించుకున్న నటి

సీరియల్ కోసం గుండు చేయించుకున్న నటి

తమ పాత్రలో మమేకం అయ్యేందుకు నటీనటులు అందుకు అనుగుణంగా ఎలాంటి సాహసం చేసేందుకైనా వెనకడుగు వేయడం లేదు.

ప్రస్తుతం తమ పాత్రల్లో మమేకం అయ్యేందుకు నటీనటులు అందుకు అనుగుణంగా ఎలాంటి సాహసం చేసేందుకైనా వెనకడుగు వేయడం లేదు. పాత్ర ప్రాధాన్యత, సహజత్వం కోసం నటులు పరితపిస్తుంటారు. అందుకోసం ఏమైనా చేసేందుకు వెనకాడరు. ఇప్పటివరకూ క్యారెక్టర్కు అనుగుణంగా గుండు చేయించుకుని నటించిన నటులను వెండితెరపైనే చూశాం. తాజాగా  ఆ జాబితాలోకి బుల్లితెర నటి కూడా చేసింది. సీరియల్లోని తన  పాత్ర కోసం నిజంగానే గుండు గీయించుకుని నటిస్తుండడం విశేషం. 'యే వాదా రహా' సీరియల్ కోసం రింకూ కర్మార్కర్ తన కురులను త్యాగం చేసింది. నా బోలే తుమ్ మే కుచ్ కహా, కహీనీ ఘర్ ఘర్ కీ, టీవీ సీరియల్స్లో తన నటనతో రింకూ ఎంతో పేరు పొందింది.

'ఎంతో ఇష్టమైన జుట్టును ఓ సీరియల్ కోసం వదులుకోవడం నా పిచ్చితనమే. కానీ ఒక నటిగా ఇలా చేయడంలో తప్పులేదనిపించింది. నేను నటించే క్యారెక్టర్లో జీవించాలనే ఒక పిచ్చితనం ఉంది. అది కేవలం ఈ సీరియల్లో నేను నటిస్తున్న క్యారెక్టర్కే కాదు. ఈ షో రచయిత, నిర్మాతలు కూడా ప్రోగ్రామ్పై అంతే కసితో ఉన్నారు. నా హెయిర్ డ్రెస్సర్ నాకింత డిఫరెంట్ లుక్స్ ఇచ్చినందుకు థాంక్స్'  అని రింకూ అన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement