రికార్డ్‌ బ్రేక్‌: 215 అడుగుల సూర్య కటౌట్‌

World Largest Cut Out By Suriya Fans At Tiruttani - Sakshi

అభిమానానికి హద్దు ఉండదేమో. తమ ఆరాధ్య నటుడు సినిమా రిలీజ్‌ అంటే ఇక ఫ్యాన్స్‌కు పండుగే. పూల దండలు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో సూర్య అభిమానుల కూడా తమ అభిమానంతో ఏకంగా రికార్డునే బ్రేక్‌ చేశారు.. సూర్య నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో 215 అడుగుల ఎత్తైన కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కటౌట్‌ను తిరుత్తణిలో బుధవారం ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌ను చూసేందుకు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా కటౌట్‌ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కాగా ఇప్పటివరకూ హీరో అజిత్‌ ఫ్యాన్స్‌  ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్‌ దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు నమోదు అయింది. అయితే తాజాగా సూర్య అభిమానులు ఆ రికార్డును బ్రేక్‌ చేసి ఏకంగా 215 అడుగుల పొడవైన కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 40మంది కార్మికులు ఈ కటౌట్‌ నిర్మాణంలో పాల్గొన్నారు. 35 రోజుల పాటు శ్రమించి తిరుత్తణి- చెన్నై బైపాస్‌ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top