భళి భళి భళి రా భళి... | This is why Housefull 4 will be a mega project | Sakshi
Sakshi News home page

భళి భళి భళి రా భళి...

Nov 10 2017 12:37 AM | Updated on Nov 10 2017 12:37 AM

This is why Housefull 4 will be a mega project  - Sakshi

... సాహోరే బాహుబలి.. పాట ఎంత బాగుంటుందో కదా. ‘బాహుబలి–2’లోని ఈ పాటను తెర మీద చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ కూడా ‘బాహుబలి’గా మారనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ‘బాహుబలి’ బహు భాషల్లో విడుదలైంది కాబట్టి, హిందీలో రీమేక్‌ అయ్యే అవకాశం లేదు. మరి.. అక్షయ్‌కుమార్‌ ‘బాహుబలి’గా మారడం ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే... అక్షయ్‌కుమార్‌ మెయిన్‌ లీడ్‌లో రూపొందిన ‘హౌస్‌ఫుల్‌’ చిత్రం గురించి తెలిసే ఉంటుంది.

ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన మూడు భాగాలు వచ్చాయి. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్‌ 4’ రూపొందనుంది. ఫస్ట్, సెకండ్‌ పార్ట్‌లకు దర్శకత్వం వహించిన సాజిద్‌ ఖాన్‌ నాలుగో భాగానికి దర్శకత్వం వహించనున్నారు. మూడో భాగం సాజిద్‌ ఫర్హాద్‌ దర్శకత్వంలో రూపొందింది. ‘హౌస్‌ఫుల్‌’ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సాజిద్‌ నడియాడ్‌వాలా ఫోర్త్‌ మూవీని త్వరలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రజెంట్, పాస్ట్‌.. రెండు నేపథ్యాలలో రూపొందనుంది.

పాస్ట్‌ స్టోరీ ‘బాహుబలి’ కాలంలో ఉంటుంది. అక్షయ్‌కుమార్‌ గుర్రపు స్వారీ. కత్తి యుద్ధం చేస్తారట. ‘బాహుబలి’ తారలు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ వాడారో అలాంటివే డిజైన్‌ చేయిస్తున్నారట. ఆ ఎపిసోడ్‌ మొత్తం ‘బాహుబలి’ని తలపించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటివరకూ తమ సంస్థ నుంచి వచ్చిన అన్ని కామెడీ ఎంటర్‌టైనర్స్‌కన్నా సాజిద్‌ నడియాడ్‌వాలా ఈ ఎంటర్‌టైనర్‌ని ఎక్కువ బడ్జెట్‌లో తీయనున్నారు. మరి.. ‘బాహుబలి’లా అంటే.. హయ్యస్ట్‌ బడ్జెట్‌ అవకుండా ఉంటుందా?

Advertisement
 
Advertisement
Advertisement