థియేటర్స్‌ బంద్‌కు అందరూ సహకరించాలి – ప్రతాని రామకృష్ణ గౌడ్‌

we proclaim to the theater bandh from march-2 prathani ramakrishna goud - Sakshi

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి ధరల విషయంలో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి థియేటర్స్‌ను మూసివేయాలన్న నిర్మాతల నిర్ణయానికి తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు తెలిపింది.

ఈ సందర్భంగా శనివారం పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ– ‘‘సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్‌ వ్యవస్థపై పోరాటం చేయడం శుభపరిణామం. శుక్రవారం బెంగళూరులో జరిగిన చర్చల్లో డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థల వారు 9 శాతానికి మించి ధరలు తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. అసలు డిజిటల్‌ చార్జీలు 5 ఏళ్లకు మించి ఉండకూడదు.

13 ఏళ్లైనా అవే రేట్లు తీసుకుంటూ నిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఈ విధంగా లేదు. క్యూబ్, యుఎఫ్‌ఓ, పిఎక్స్‌డి సంస్థలతో అగ్రిమెంట్స్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే తక్కువ రేట్లకే డిజిటల్‌ సర్వీస్‌లు ప్రొవైడ్‌ చేస్తామని అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. కాబట్టి మార్చి 2 నుంచి ఈ థియేటర్స్‌ బంద్‌కు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. టీఎఫ్‌సీసీ సెక్రటరీ సాయి వెంకట్‌ కూడా పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top