విక్కీతో డేటింగ్‌ చేయాలనుంది

Want Date With vicky kaushal Said Tamannah - Sakshi

సినిమా: పంజాబీ బ్యూటీ తమన్నా చిత్రాల గురించి ఏమోగానీ, ఈ అమ్మడి వ్యక్తిగత విషయాల గురించి ఇటీవల పలు రకాల ప్రచారాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయనతో డేటింగ్‌ చేయాలి, ఎవరితో ప్రేమ లేదు లాంటి ప్రచారాలు హోరెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ సంచలన యువ నటుడు విక్కీ కౌశల్‌తో డేటింగ్‌ చేయాలనుందని తమన్నా పేర్కొని వార్తల్లోకి ఎక్కింది. ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌తో డేటింగ్‌ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. బాలీవుడ్‌లో యురి చిత్రంతో సంచలన నటుడిగా పేరు తెచ్చుకున్న విక్కీ కౌశల్‌కి ఇప్పుడు అక్కడ క్రేజే వేరు. ఈయన ఇటీవలే తన ప్రేయసి నుంచి దూరం అయ్యారు. ఇక నటి తమన్నా విషయానికి వస్తే ఆ మధ్య క్రికెట్‌ క్రీడాకారుడు విరాట్‌ కోహ్లీ అంటే ఇష్టం అని పేర్కొంది.

అయితే తానాయన్ని ఎప్పుడూ ప్రేమించలేదని చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరూ ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. అప్పుడు వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ యాడ్‌ చిత్రీకరణ సమయంలో తాను కోహ్లీతో నాలుగు మాటలే మాట్లాడానని తమన్నా అంటోంది. ఆ తరువాత ఆయనతో టచ్‌లో లేనని చెప్పింది. ఇక ఈ అమ్మడి గురించి ప్రచారంలో ఉన్న మరో విషయం అమెరికాకు చెందిన ఒక వైద్యుడితో ప్రేమ కలాపాలు సాగిస్తోందన్నది. ఈ ఏడాది ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతోందని టాక్‌. అయితే తాను ఏ డాక్టర్‌ను ప్రేమించలేదని తమన్నా  అంటోంది. కాగా ఇంతకుముందు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌కు లిప్‌ టూ లిప్‌ చుంభనానికి రెడీ అని పేర్కొంది. తాజాగా మరో బాలీవుడ్‌ యువ నటుడు విక్కీ కౌశల్‌పై దృష్టి పడింది. ఆయనతో డేటింగ్‌ చేయాలనుందన్న కోరికను బయట పెట్టింది. రేపు తానలా అనలేదని అన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇలా ఏదో ఒక సంచలన స్టేట్‌మెంట్‌తో వార్తల్లో ఉండటానికి చేస్తున్న ఫీట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ మిల్కీబ్యూటీ నటిగా మాత్రం బిజీగానే ఉంది. ప్రస్తుతం టర్కీలో విశాల్‌తో రొమాన్స్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top