కోలీవుడ్‌కు వినయ విధేయ రామ | Vinaya Vidheya Rama in Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు వినయ విధేయ రామ

Jan 12 2019 7:42 AM | Updated on Jul 14 2019 1:57 PM

Vinaya Vidheya Rama in Kollywood - Sakshi

సినిమా: వినయ విధేయ రామ అంటూ టాలీవుడ్‌ యువ స్టార్‌ నటుడు రామ్‌చరణ్‌ మరోసారి తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అవును ఈయన ఇంతకు ముందు తెలుగు చిత్రం మగధీర అనువాదంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తరువాత కూడా రామ్‌చరణ్‌ నటించిన పలు చిత్రాలు తమిళంలోకి అనువాదమై నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన తాజా భారీ తెలుగు చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అడ్వాని హీరోయిన్‌గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళస్టార్‌ నటుడు ప్రశాంత్, స్నేహా, మధుమిత, ముఖేష్‌రిషీ, జేపీ.హరీశ్‌ ఉత్తమన్, ఆర్యన్‌ రాజేశ్, రవివర్మన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రకాశ్‌ ఫిలింస్‌ సమర్పణలో డీవీవీ.ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌ నిర్మించింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతబాణీలు అందించారు. కుటుంబనేపథ్యంలో  ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్, వినోదం, రాజకీయం, సాహసం అంటూ మంచి కమర్శియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలను బ్రహ్మాండమైన సెట్స్‌ వేసి చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. చిత్రంలోని పోరాట దృశ్యాలకు మాత్రమే రూ.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కనల్‌కన్నన్‌ కంపోజ్‌ చేసిన ఈ ఫైట్స్‌ సీక్వెన్స్‌ అదిరిపోయేలా ఉంటాయని చెప్పారు. వినయ విధేయ రామా చిత్రం తెలుగులో శుక్రవారం విడుదలైంది. ఫిబ్రవరి తొలివారంలో తమిళంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement