జూంగా సేలౌట్‌! | Vijay Sethupathi, Sayyeshaa's new film Junga | Sakshi
Sakshi News home page

జూంగా సేలౌట్‌!

Sep 29 2017 4:22 AM | Updated on Sep 29 2017 4:22 AM

Vijay Sethupathi, Sayyeshaa's new film Junga

తమిళసినిమా: జూంగా చిత్రం సేలౌట్‌ అయిపోయిందట. ఏమిటీ చిత్రం వ్యాపారం పూర్తి అయితే ఒక వార్తా అని అనుకుంటున్నారా? ఇవాళ ఎంత పెద్ద హీరో నటించిన చిత్రమైనా క్రయ విక్రయాలు అంత సులభం కాని పరిస్థితి నెలకొందన్నది వాస్తవం. ఇక వ్యాపారం కాక విడుదలకు నోచుకోని చిత్రాల సంఖ్య చాలానే ఉన్నాయి.అలాంటిది చిత్రం సెట్‌పైకి వెళ్లకుండానే సేలౌట్‌ అయ్యిందంటే కచ్చితంగా వార్తే అవుతుంది.

ఇక జూంగా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని నటుడు విజయ్‌సేతుపతి సొంతంగా నిర్మి స్తూ, కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో సాయేషాసైగల్‌ నాయకిగా నటించనుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ జూంగా చిత్రానికి గోకుల్‌ దర్శకత్వం వహించనున్నారు. చిత్ర షూటింగ్‌ ఈ నెలాఖరున ప్రారం భం కానుంది. ఇలాంటి పరిస్థితిలో జూంగా చిత్రాన్ని తొలి కాపీ ప్రాతిప్రదికన ఏ అండ్‌ బీ సంస్థ కొనుగోలు చేసిందట.

ఈ విషయాన్ని చిత్ర వర్గాలు వెల్లడిస్తూ, విక్రమ్‌వేదా చిత్రం విజయంతో విజయ్‌సేతుపతి మార్కెట్‌ వ్యాల్యూ పెరిగిందనే టాక్‌ కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోందన్నారు. ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా చిత్రం తరువాత విజయ్‌సేతుపతి, గోకుల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడం కూడా జూంగా చిత్రంపై అంచనాలు పేరగడానికి ఒక కారణం అంటున్నారు. విజయ్‌సేతుపతి నటించిన తాజా చిత్రం కరుప్పన్‌ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదల కానుందన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement