వర్మకు నో చెప్పిన విజయ్‌ | Vijay Devarakonda politely declined Rgv offer | Sakshi
Sakshi News home page

Mar 14 2018 11:18 AM | Updated on Mar 14 2018 1:37 PM

Vijay Devarakonda politely declined Rgv offer - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ, విజయ్‌ దేవరకొండ

అర్జున్‌ రెడ్డి సినిమాతో సౌత్‌ లోమోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు యువ నటుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో చేతి నిండా సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ ట్రావెల్‌ డ్రామాలో నటిస్తున్న ఈ విజయ్‌ ఈ సినిమాతో పాటు మహానటి షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఈరెండు సినిమాల తరువాత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న నోటా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు.

తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం వర్మ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా విజయ్, వర్మ సినిమాకు నో చెప్పాడట. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ మరికొన్ని సినిమాలను ఇప్పటికే ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement