హత్య చేసిందెవరు?  | Vijay Antony Kolaigaran to release on June 5 | Sakshi
Sakshi News home page

హత్య చేసిందెవరు? 

May 8 2019 1:03 AM | Updated on May 8 2019 1:03 AM

 Vijay Antony  Kolaigaran to release on June 5 - Sakshi

విజయ్‌ ఆంటోని, అర్జున్‌ ప్రధాన పాత్రల్లో  ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. అషిమా కథానాయికగా నటించారు. దియా మూవీస్‌ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా టి.నరేష్‌ కుమార్‌–టి.శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘మర్డర్‌ మిస్టరీ, క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌ నెరేషన్‌తో రక్తి కట్టిస్తుంది.

అర్జున్‌ నటన సినిమాకే హైలైట్‌. విజయ్‌ ఆంటోని పాత్ర ఏమిటిన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రంజాన్‌ కానుకగా జూన్‌ తొలి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె.కింగ్, కెమెరా: మ్యూక్స్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement