
విడుదలకు ముందే నిషేధమా?
విడుదలకు ముందే సినిమాను వ్యతిరేకించడం, నిషేధించాలని ఆందోళనలు చేయడం, కోర్టులు, పోలీసుస్టేషన్‌లను ఆశ్రయించడం ఈ మధ్య పరిపాటిగా మారిందని కేంద్ర సెన్సార్‌బోర్డు సభ్యులు బక్రిసామి అన్నారు.
చెన్నై: విడుదలకు ముందే సినిమాను వ్యతిరేకించడం, నిషేధించాలని ఆందోళనలు చేయడం, కోర్టులు, పోలీసుస్టేషన్‌లను ఆశ్రయించడం ఈ మధ్య పరిపాటిగా మారిందని కేంద్ర సెన్సార్‌బోర్డు సభ్యులు బక్రిసామి అన్నారు. తాజాగా కమల్‌హాసన్ నటించిన ఉత్తమవిలన్ చిత్రాన్ని నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ సమితికి చెందిన కొందరు ఆందోళనలు చేసిన నేపథ్యంలో బక్రిసామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తమకు నచ్చకుంటే ఎలాంటి సినిమాన్నైనా నిషేధించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు బెదిరింపులకు దిగడం సమంజసం కాదన్నారు. ఒక చిత్రాన్ని చూడకుండా అందులో ఓ వర్గాన్ని అవమానించారని, కొందరి మనోభావాలను కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయని ఆరోపించడం దారుణమన్నారు. సినిమాల్లో ఆయా పాత్రలకు తగ్గట్టుగానే సంభాషణలను అనుమతించడం జరుగుతోందన్నారు. భావ ప్రకటిత స్వాతంత్య్రాన్ని కొందరు కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.