అశ్లీలత మచ్చుకైనా లేని చిత్రం : వెంకయ్య నాయుడు

Venkaiah Naidu Praises Karthi Chinna Babu Movie - Sakshi

ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు రావడం అరుదే. కార్తీ హీరోగా వచ్చిన ‘చినబాబు’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తోంది. పల్లె వాతావరణం, రైతు నేపథ్యం, కుటుంబం, బంధాలు, ప్రేమలు, అనురాగాలతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ మూవీపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్‌, నిర్మాత సూర్య, నటుడు కార్తీకి అభినందనలు. ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా ‘చినబాబు’. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్దతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాదభరితంగా రూపొందిన చినబాబు సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top