కామెడీ టు సీరియస్‌

Varun Tej joins the shoot of Valmiki - Sakshi

‘పెళ్లాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలో నాకు మస్తు తెలుసు’ అంటూ వెంకటేశ్‌తో కలసి ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) లో కామెడీ పండించారు వరుణ్‌ తేజ్‌. ఇప్పుడు ‘వాల్మీకి’ సినిమా కోసం  సీరియస్‌ మూడ్‌లోకి మారిపోయారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ఇది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం స్టార్ట్‌ అయింది. తమిళ చిత్రం ‘జిగర్తండా’కి ఇది అఫీషియల్‌ రీమేక్‌. ఇందులో వరుణ్‌ తేజ్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని సమాచారం. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషించనున్నారని టాక్‌. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్‌.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top