‘వాల్మీకి’ విడుదల వాయిదా!

Varun Tej And Harish Shankar's Valmiki Postponed - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్మీకి. తమిళ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాని, విక్రమ్‌ కె కుమార్‌ల గ్యాంగ్‌ లీడర్‌ కూడా రిలీజ్‌ అవుతుండటంతో రెండు చిత్రాల నిర్మాతలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెలాఖరున రిలీజ్ అవుతున్న సాహో మేనియా సెప్టెంబర్‌ 13 వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ఆ రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య కూడా వస్తుందని భావిస్తున్నారు. అందుకే గ్యాంగ్‌లీడర్‌ను ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసి వాల్మీకిని 20న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top