నాగార్జున పాత్రలో నటించనున్న ఉపేంద్ర | Upendra And Prema To Play The Lead In Kannada Remake Of Nagarjuna's Soggade Chinni Nayana | Sakshi
Sakshi News home page

నాగార్జున పాత్రలో నటించనున్న ఉపేంద్ర

May 25 2016 8:33 PM | Updated on Jul 15 2019 9:21 PM

నాగార్జున పాత్రలో నటించనున్న ఉపేంద్ర - Sakshi

నాగార్జున పాత్రలో నటించనున్న ఉపేంద్ర

కన్నడ సినీ రంగంలో ఒకానొక కాలంలో హిట్‌పెయిర్‌గా నిలిచిన ఉపేంద్ర, ప్రేమ చాలా విరామం తర్వాత

బెంగళూరు: కన్నడ సినీ రంగంలో ఒకానొక కాలంలో హిట్‌పెయిర్‌గా నిలిచిన ఉపేంద్ర, ప్రేమ చాలా విరామం తర్వాత కలిసి నటించనున్నారు. తెలుగులో నాగార్జున నటించిన సోగ్గాడె చిన్ని నాయన చిత్రాన్ని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేయనున్నారు.
 
  తెలుగులో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన పాత్రలలో ఉపేంద్ర నటించనుండగా నాగార్జనకు జోడీగా రమ్యకృష్ణ నటించిన పాత్రను కన్నడలో ప్రేమ కనిపించనున్నారు. 17 సంవత్సరాల తర్వాత ప్రేమ, ఉపేంద్ర కలిసి నటించనున్నారనే వార్తతో ఉపేంద్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి తగిన మార్పులు,చేర్పులు,కూర్పులు అన్ని హీరో ఉపేంద్ర స్వయంగా చేస్తుండడడం విశేషం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement