అందరికీ వయసు పెరుగుతుంది కానీ రవితేజకు మాత్రం తగ్గుతోంది – వినాయక్‌ | Touch Chesi Chudu Pre Release Event | Sakshi
Sakshi News home page

అందరికీ వయసు పెరుగుతుంది కానీ రవితేజకు మాత్రం తగ్గుతోంది – వినాయక్‌

Jan 28 2018 1:20 AM | Updated on Jan 28 2018 1:20 AM

Touch Chesi Chudu Pre Release Event - Sakshi

వంశీ, వినాయక్, వక్కంతం వంశీ, రవితేజ, సీరత్, రాశీఖన్నా, నల్లమలుపు బుజ్జి, విక్రమ్‌

‘‘అందరికీ సినిమా సినిమాకు వయసు పెరుగుద్ది కానీ రవితేజకి మాత్రం తగ్గుతోంది. ‘విక్రమార్కుడు’ సినిమా చూసి ఎలా ఫీల్‌ అయ్యామో ‘టచ్‌ చేసి చూడు’ చూసి కూడా అలానే ఫీల్‌ అవుతాం’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. రవితేజ, రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరో హీరోయిన్లుగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ మోహన్‌ నిర్మించిన చిత్రం ‘టచ్‌ చేసి చూడు’.

ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకలో వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు స్పెషల్‌. కారణం నిర్మాతలు బుజ్జి, వంశీ మోహన్‌గారు. దర్శకుడు విక్కీ (విక్రమ్‌) నాతో కలిసి పని చేశాడు. రెండు రీళ్లు చూశాను. చాలా బాగా తెరకెక్కించాడు’’ అన్నారు. ‘‘మా టెక్నీషియన్స్‌ రామ్‌–లక్ష్మణ్, రవివర్మన్, వెంకట్‌ ఫైట్‌ మాస్టర్స్‌ ఒక్కొక్కరు ఒక్కో ఫైట్‌ చేశారు. నా ప్రొడ్యూసర్స్‌ ఇద్దరూ నా ఫ్రెండ్స్‌. విక్రమ్‌ సిరికొండ నాకు ‘మిరపకాయ్‌’ సినిమా నుంచి తెలుసు. వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్‌ బాగా హ్యాంyì ల్‌ చేశాడు. జామ్‌ 8 అద్భుతమైన సాంగ్స్‌ ఇచ్చారు’’ అన్నారు రవితేజ.

‘‘నేను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం హీరో రవితేజగారి ‘కిక్‌’ సినిమానే. ‘టచ్‌ చేసి చూడు’ ఫుల్‌ కమర్షియల్‌గా ఉంటుంది’’ అన్నారు వక్కంతం వంశీ. విక్రమ్‌ సిరికొండ మాట్లాడు తూ – ‘‘నా సినిమా గురు వినాయక్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా స్టార్ట్‌ అవ్వడానికి కారణం బుజ్జిగారు. నా మాస్‌ రాజా ఎనర్జీ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కు ఇంకో క్వాలిటీ ఉంది. అదేంటంటే ఆ ఎనర్జీని చుట్టూ ఉన్న వాళ్లకి పాస్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘రవితేజగారితో ‘కృష్ణ’ సినిమా తీయలేకపోయాను. పది సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం దొరికింది. చక్కటి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్‌’’ అన్నారు వంశీమోహన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement