ఓవర్సీస్‌లో తెలుగు సినిమాల దూకుడు

Tollywood Stamina At Overseas Collection - Sakshi

తెలుగు సినిమాల స్టామినా పెరిగింది. వంద కోట్లు ఈజీగా కలెక్ట్‌ చేసేస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌కు హద్దులు ఉండేవి. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఆడేవి. వసూళ్లలో పెద్ద రికార్డులు కూడా క్రియేట్‌ చేసేవి కాదు. అయితే బాహుబలి సినిమాతో దేశం మొత్తం టాలీవుడ్‌ వైపు చూసింది. రాజమౌళి తన బాహుబలి సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్‌కు క్రేజ్‌ తీసుకొచ్చాడు. 

ఇప్పుడు తెలుగు సినిమాలు రాష్ట్రాలు దాటి దేశాల హద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 2018లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కలకలలాడింది . ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల మోతను మోగించాయి.  ఈ ఏడాదిలో రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి సినిమాలు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచాయి. 

ఇప్పుడు తాజాగా ‘అరవింద సమేత’ రికార్డుల వేటకు బయలుదేరింది. ఇప్పటికే వంద కోట్లను కలెక్ట్‌ చేసి వేగాన్ని పెంచుతోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆస్ట్రేలియా, అమెరికాల్లో వసూళ్లలో కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. హిందీ సినిమాల కంటే మన తెలుగు సినిమాలకే ఓవర్సీస్‌లో ఆదరణ ఎక్కువ ఉందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే మన సినిమాలు జపాన్‌, చైనా దేశాల్లో కూడా రిలీజ్‌ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇంకా తన పరిధిని పెంచుకుంటూ.. కథ, కథనాల్లో కొత్తదనాన్ని చూపిస్తూ.. మరింత ముందుకు దూసుకుపోవాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top