స్క్రీన్‌ టెస్ట్‌

Tollywood Movies Special Screen Test - Sakshi

► ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి ’ అనే పాట రంగస్థలం సినిమాలోనిది. ఆ స్పెషల్‌ సాంగ్‌లో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) తమన్నా భాటియా   బి) పూజా హెగ్డే   సి) సన్నీ లియోన్‌     డి) శ్రుతీహాసన్‌

► సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన‘ప్రతిధ్వని’ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడెవరో కనుక్కోండి ?
ఎ) రవిరాజా పినిశెట్టి   బి) బి. గోపాల్‌     సి) కోడి రామకృష్ణ   డి) ముత్యాల సుబ్బయ్య

► శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన తొలి సినిమా ఏంటో  చెప్పుకోండి?
ఎ) ఆనంద్‌    బి) గోదావరి    సి) డాలర్‌ డ్రీమ్స్‌    డి) హ్యాపీడేస్‌

► ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ దర్శకుడు ‘వక్కంతం వంశీ’ సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఏం చేశారో తెలుసా?
ఎ) రైటర్‌   బి) కెమెరామెన్‌   సి) ఆర్టిస్ట్‌   డి) టీవీ యాంకర్‌

► ‘ ప్రేమ ఇష్క్‌ కాదల్‌’లో కథానాయికగా నటించిన  వితికా లవర్‌బోయ్‌ ఇమేజ్‌ ఉన్న హీరోని పెళ్లాడింది. ఎవరా హీరో?
ఎ) నందు   బి) వరుణ్‌ సందేశ్‌   సి) తరుణ్‌   డి) హవీష్‌

► ‘నర్తనశాల’ అనగానే మనకు గుర్తొచ్చే పేరు యన్టీఆర్‌. ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో నటిస్తున్న యువ హీరో ఎవరో కనుక్కోండి చూద్దాం?
ఎ) సాయిధరమ్‌ తేజ్‌     బి) నాగశౌర్య  సి) విజయ్‌ దేవరకొండ  డి) సుధీర్‌బాబు

► ‘నాకు నచ్చేవి రెండే రెండు. ఒకటి నిద్ర, రెండోది మంచి మొగుడు’ అనే డైలాగ్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలోనిది.  ఆ డైలాగ్‌  చెప్పిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) సమంత   బి) అంజలి   సి) తేజస్విని మడివాడ   డి) ప్రణీత

► రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమాలో చరణ్‌ సరసన ఒక హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ నటించారు. మరో హీరోయిన్‌ ఎవరో గుర్తుందా?
ఎ) జెనీలియా    బి) రకుల్‌ప్రీత్‌ సింగ్‌    సి) అమీ జాక్సన్‌   డి) కాజల్‌ అగర్వాల్‌

► మంచు మనోజ్‌  పుట్టినరోజు మే 20న. అదే రోజు పుట్టిన మరో హీరో ఎవరో తెలుసా?
ఎ) ప్రభాస్‌     బి) రామ్‌చరణ్‌    సి) యన్టీఆర్‌   డి) మహేశ్‌బాబు

► కేథరిన్‌ మొదటి సినిమా ‘చమ్మక్‌చల్లో’.  ఆమెను తెలుగు లె రకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) నీలకంఠ   బి) దేవా కట్టా   సి) సంపత్‌ నంది   డి) అనిల్‌ రావిపూడి

► మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సౌతిండియన్‌ ఆర్టిస్ట్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) మోహన్‌ లాల్‌   బి) సురేష్‌ గోపి    సి) మమ్ముట్టి   డి) రజనీకాంత్‌

► ‘అమ్మ స్పర్శ గుర్తుంది కానీ అమ్మ గుర్తులేదు, నాన్న ప్రేమ గుర్తుంది కానీ నాన్న గుర్తు లేరు’ అని మహేశ్‌ బాబు  చెప్పే ఈ డైలాగ్‌ ‘1 నేనొక్కడినే’ చిత్రంలోనిది. ఈ డైలాగ్‌ రాసిన రచయిత ఎవరు?
ఎ) వేమారెడ్డి    బి) రవి అబ్బూరి    సి) సుకుమార్‌   డి) యం. రత్నం

► ఏ పెళ్లి వేడుకలో అయినా తప్పనిసరిగా వినిపించే పాట ‘పెళ్లి పుస్తకం’ సినిమాలోని ‘శ్రీరస్తు శుభమస్తు..’. ఆ పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) ఆరుద్ర   బి) దాశరథి   సి) సి. నారాయణ రెడ్డి   డి) సిరివెన్నెల

► దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి ట్వీటర్‌ ఐడీ ఏంటో తెలుసుకుందామా?
ఎ)  రాజమౌళి   బి) మీ రాజమౌళి   సి) మై నేమ్‌ ఈజ్‌ రాజమౌళి    డి) యువర్స్‌ రాజమౌళి

► ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్‌ ‘తరుణ్‌ భాస్కర్‌’ ‘మహానటి’ చిత్రంలో ఒక దర్శకుని పాత్రను పోషిస్తున్నారు. ఆయన ఏ దర్శకుని పాత్రను పోషిస్తున్నారో తెలుసా?
ఎ) కమలాకర కామేశ్వరరావు   బి) కె.వి.రెడ్డి   సి) వి. మధుసూదనరావు    డి) కె.యస్‌ ప్రకాశరావు

► ‘100 పర్సెంట్‌ లవ్‌’ తెలుగు సినిమాను ఏడు సంవత్సరాల తర్వాత తమిళ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్‌గా తమన్నా చేశారు. ఇప్పుడు తమిళ్‌లో చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) షాలీనీ పాండే    బి) రాశీ ఖన్నా    సి) కీర్తీ సురేశ్‌    డి) నివేథా థామస్‌

► ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ పతాకంపై ఇప్పటివరకు నిర్మించిన మూడు సినిమాలూ సూపర్‌ హిట్‌. అన్ని సినిమాలకు సంగీత దర్శకుడు ఒక్కడే. ఎవరా సంగీత దర్శకుడో కనుక్కోండి?
ఎ) మణిశర్మ            బి) అనూప్‌ రూబెన్స్‌    సి) దేవిశ్రీ ప్రసాద్‌    డి) జిబ్రాన్‌

►   రజనీకాంత్‌ నటించిన  ‘చంద్రముఖి’ సినిమాలో  చంద్రముఖి పాత్రను పోషించిన నటి ఎవరో కనుక్కోండి?
ఎ) నయనతార   బి) జ్యోతిక     సి) అనుష్క   డి) రాయ్‌ లక్ష్మీ

► హీరో రవితేజ, తనూరాయ్‌ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) ఇడియట్‌      బి) అమ్మా నాన్న  ఓ తమిళమ్మాయి  సి) ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం     డి) ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

► ఈ క్రింది ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టండి?
ఎ) హన్సిక   బి) శ్రుతీహాసన్‌    సి) తమన్నా   డి) షీలా

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) బి 3) సి 4) డి 5) బి 6) బి 7) ఎ 8) సి 9)  సి 10) ఎ 11) సి
12) సి 13) ఎ 14) ఎ 15) బి 16) ఎ 17) సి18) బి 19) సి20) బి

నిర్వహణ: శివ మల్లాల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top