డిసెంబర్ 22న 'తొలి కిరణం' రిలీజ్ | Toli Kiranam Movie release on Dec 22nd | Sakshi
Sakshi News home page

Nov 26 2017 10:23 AM | Updated on Nov 26 2017 10:23 AM

Toli Kiranam Movie release on Dec 22nd - Sakshi

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో  T. సుధాకర్ నిర్మాత గా  జె. జాన్ బాబు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'తొలి కిరణం'.  ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జాన్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తొలి కిరణం చిత్రాన్ని  తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాము. యేసు క్రీస్తు సినిమాలో ఇప్పటి వరకు రాని  కొత్త పాయింట్ తో మా చిత్రాన్ని నిర్మిచాం. 

45 నిమిషాలు అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపు అయ్యింది. మా చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అదించటం సినిమా పై అంచనాలు పెంచింది. ఆయన అద్భుతమైన పాటలు అందిచారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. మలయాళ నటి భవ్య మేరీ మాతగా నటించింది. 'తొలి కిరణం' చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement