హీరో లేడు... విలనూ లేడు! | The second schedule of Saho will start in the first week of August. | Sakshi
Sakshi News home page

హీరో లేడు... విలనూ లేడు!

Jul 14 2017 10:49 PM | Updated on Sep 5 2017 4:02 PM

హీరో లేడు... విలనూ లేడు!

హీరో లేడు... విలనూ లేడు!

మరి ఎవరున్నారు? అంటే... హీరోలను మించిన హీరో, విలన్లను మించిన విలన్‌! ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సాహో’.

... మరి ఎవరున్నారు? అంటే... హీరోలను మించిన హీరో, విలన్లను మించిన విలన్‌! ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సాహో’. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ‘జస్ట్‌ హీరో బేస్డ్‌ ఫిల్మ్, విలన్‌ బేస్డ్‌ ఫిల్మ్‌’ అనేలా ఉండదట. ఇందులో ప్రభాస్‌ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్‌ సగటు కమర్షియల్‌ సినిమాల్లోని హీరోలతో పోలిస్తే... ‘అంతకు మించి’ అనేలా ఉంటుందట!

నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ క్యారెక్టర్‌ కూడా అంతేనట. ఎన్నో డిస్కషన్స్, ఎంతో రీసెర్చ్‌ తర్వాత ‘సాహో’లో ప్రభాస్‌ లుక్‌ను ఫైనలైజ్‌ చేశారు. టెక్నికల్‌గానూ ‘సాహో’ హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఇంటర్నేషనల్‌ టెక్నికల్‌ అండ్‌ యాక్షన్‌ టీమ్స్‌ ఈ సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా అనుష్కను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement